హుస్నాబాద్లోని 18వ వార్డులో భక్తుల కోసం మహా అన్నదాన కార్యక్రమం

రిపోర్టర్: Damidi Chandra Reddy స్థలం: హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో మంగళవారం రాత్రి స్థానిక 18వ వార్డులో గణనాధుని మండపం వద్ద కౌన్సిలర్ వాల సుప్రజ, నవీన్ రావు ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, స్థానిక కౌన్సిలర్లు, ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు.