తెలుగుదేశం పార్టీ గెలుపే మా ఏకైక లక్ష్యమన్న ప్రముఖ వ్యాపారవేత్త రాంజీ

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

నర్సీపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రముఖ వ్యాపారవేత్త పచ్చిగోళ్ళ రాంజీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. మాకవరపాలెం మండలంలో ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కేడర్ను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.