ఫుట్బాల్ ప్రియులకు పండగ: కోల్కతాలో బార్సిలోనా, రియల్ మాడ్రిడ్ దిగ్గజాల పోరు
రిపోర్టర్: రాజేష్
స్థలం: Kolkata
ఫుట్బాల్ ప్రియులను అలరించేందుకు భారత్లో మరో ఎల్ క్లాసికో పోరుకు రంగం సిద్ధమైందని, నవంబర్ 25వ తేదీన కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో బార్సిలోనా మరియు రియల్ మాడ్రిడ్ లెజెండ్స్ తలపడనున్నట్లు పశ్చిమ బెంగాల్ క్రీడాశాఖ మంత్రి ఇంద్రనీల్ ఖాన్ మంగళవారం వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శన మ్యాచ్లో లూయిస్ ఫిగో, కార్లెస్ పుయోల్ వంటి ప్రముఖ దిగ్గజ ఆటగాళ్లు బరిలోకి దిగే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.