'మహిళా క్రికెట్ కోసం డబ్ల్యూఏపీఎల్‌ నిర్వహణ': ఎంపీ కేశినేని శివనాథ్

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

మహిళా క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తేవాలనే లక్ష్యంతో ఏసీఏ ఆధ్వర్యంలో మంగళగిరి స్టేడియంలో ఈ నెల 19 నుంచి 27 వరకూ డబ్ల్యూఏపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. విద్యార్థినులు, ప్రేక్షకుల కోసం ఉచిత ప్రవేశంతో పాటు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.