పాల్వాయి గ్రామంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా శ్రీ గణపతి ప్రత్యేక పూజలు
రిపోర్టర్: వెంకటాపురం vishnu🙏
స్థలం: నల్గొండ
పాల్వాయి గ్రామంలో కొనసాగుతున్న శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు గణపతి పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి నిమ్మగడ్డ సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శాలివాహన బజారులో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు.