శివకార్తికేయన్‌తో విభేదాల వార్తలపై స్పందించిన వెంకట్ ప్రభు
రిపోర్టర్: సునీల్
స్థలం: చెన్నై
తమిళ స్టార్ నటుడు శివకార్తికేయన్‌తో తన సినిమా ఆగిపోవడంపై వస్తున్న వార్తలపై ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించారు. తనకూ శివకార్తికేయన్‌కు మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని, ఆయన తనకు మంచి స్నేహితుడని వెంకట్ ప్రభు స్పష్టం చేశారు. కొడుకు సినిమా ఆలస్యం కావడంతో ఒక తండ్రిగా కలిగిన ఆవేదనతోనే తన తండ్రి గంగై అమరన్ అలా మాట్లాడి ఉంటారని ఆయన వెల్లడించారు. భవిష్యత్‌లో సరైన కథ కుదిరితే శివకార్తికేయన్‌తో కచ్చితంగా సినిమా చేస్తానని ఆయన తెలిపారు.