దుర్గం చెరువు దుస్థితి: చెత్తతో నిండిన హైదరాబాద్ ప్రముఖ సరస్సు

రిపోర్టర్: కిరణ్ స్థలం: Hyderabad, Telangana

హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం దుర్గం చెరువు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. చెరువు ఉపరితలం మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తతో నిండిపోయి కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ప్రభుత్వం 'ఫ్యూచర్ సిటీ' కలల ప్రాజెక్టులపై దృష్టి పెడుతుంటే, నగరంలోని ప్రస్తుత చెరువుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి, చెరువును శుభ్రం చేసి పర్యావరణాన్ని కాపాడాలని స్థానికులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.