పుణ్యక్షేత్రాల్లో వినాయక నిమజ్జనం చేస్తూ భిన్నంగా వెళ్తున్న యువకులు

రిపోర్టర్: అశోక్ స్థలం: విజయవాడ

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని వనస్థలిపురం సాహెబ్‌నగర్‌కు చెందిన క్రాంతి యువజన సంఘం సభ్యులు వినాయక నిమజ్జనంలో వినూత్న సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. దాదాపు 15 ఏళ్లుగా ఏటా విజయవాడ, భద్రాచలం, శ్రీశైలం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వినాయక విగ్రహాలను తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నారు. తాజాగా మంగళవారం తెల్లవారుజామున వనస్థలిపురంలో బయలుదేరి మధ్యాహ్నం విజయవాడ ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానదిలో వినాయకుడిని నిమజ్జనం చేసి దుర్గమ్మ దర్శనానికి వెళ్లారు.