పారిశ్రామిక కాలుష్య కోరల్ లో పల్లెలు: చేగుంటలో విలవిల్లాడుతున్న గ్రామస్థులు
రిపోర్టర్: సురేష్
స్థలం: Chegunta
చేగుంట మండలంలో పారిశ్రామిక కాలుష్యం తీవ్రతరమవుతోందని, గ్రామాలకు సమీపంలో పరిశ్రమల ఏర్పాటుతో పల్లె ప్రజల జీవితం ప్రశ్నార్థకంగా మారుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు కలుషితమై వ్యవసాయం దెబ్బతింటోందని, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఇండస్ట్రియల్ ఏరియాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల నిరసనలతో ఫ్యాక్టరీ యాజమాన్యం చర్చలు జరిపి కాలుష్య నివారణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది.