ఈ నెల 20న ఏపీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలు

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 20న జరగనున్న ఏపీయూడబ్ల్యూజే 27వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని డిప్యూటీ జనరల్ సెక్రటరీ పిఎస్ఎస్ వి శివ ప్రసాద్ కోరారు. గురువారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మహాసభల వివరాలు వెల్లడించి గోడపత్రికలు ఆవిష్కరించారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం సంఘం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహాపాత్రో, లింగాల నరసింగరావు, ఎలిశెట్టి సురేష్,KJ శర్మ, రాధకృష్ణ, పంచాది అప్పారావు, సముద్రాల నాగరాజు, వైఎస్ పంతులు, శెట్టి గోవిందరావు, బంకురు శంకరరావు, విజయభాస్కర్, MSNరాజు తదితరులు పాల్గొన్నారు.