ఆకట్టుకుంటున్న 'కాగితం పడవలు' సినిమా ట్రైలర్

రిపోర్టర్: సతీష్ స్థలం: India

వర్ధన్, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా తెలుగు చిత్రం 'కాగితం పడవలు'. ఎంజీఆర్ తుకారం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కీర్తన నరేష్, టి.ఆర్. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ట్రైలర్ విడుదల కాగా, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచుతోంది.