తెలుగు తమిళ క్రాస్ ఓవర్ తో గోల్డెన్ భాగ్యం టైటిల్ ఖరారు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
హాస్యనటులు సత్య, యోగిబాబు ప్రధాన పాత్రల్లో పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న తెలమిల్ ప్రాజెక్ట్ కు గోల్డెన్ భాగ్యం అనే ఆసక్తికరమైన టైటిల్ ని చిత్ర బృందం ఖరారు చేసినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ బైలింగ్వల్ క్రాస్ ఓవర్ ఎంటర్టైనర్ గ్లింప్స్ లో ఇద్దరు నటులు వైట్ అండ్ వైట్ ట్రెడిషనల్ డ్రెస్సుల్లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రంలో ప్రేమతో పాటు క్రైమ్, యాక్షన్ అంశాలు ఉంటాయని మేకర్స్ తెలిపారు.