హవాయి విశ్వవిద్యాలయం అసోసియేట్ డీన్‌గా డాక్టర్ సురేంద్ర దారా బాధ్యతలు
రిపోర్టర్: సునీల్
స్థలం: హవాయి
హవాయి విశ్వవిద్యాలయం మనోవాలోని సీటీఏహెచ్ఆర్ విభాగానికి అసోసియేట్ డీన్‌గా డాక్టర్ సురేంద్ర దారా సెప్టెంబర్ 1 నుంచి బాధ్యతలు చేపట్టినట్లు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. కీటకశాస్త్రం, సమగ్ర సస్యరక్షణ నిర్వహణ రంగాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న ఆయన, హవాయిలోని ఆహార ఉత్పత్తిదారులు, కుటుంబాలకు శాస్త్రాధారిత విస్తరణ విద్య, పరిశోధనలను అందించే వ్యూహాలకు దిశానిర్దేశం చేయనున్నారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులు, సహజ వనరుల పరిరక్షణ, ఆహార భద్రత లక్ష్యంగా ఆయన తన నూతన బాధ్యతల్లో కీలకమైన కార్యాచరణను అమలు చేయనున్నారు.