ఏపీలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం

రిపోర్టర్: సునీల్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల కోసం 'దివ్యాంగ శక్తి' పథకాన్ని అమలు చేస్తోంది. 40 శాతం పైగా వైకల్యం ఉన్న వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. క్యూఆర్ కోడ్, ఆర్ఎఫ్ఐడీ చిప్ ఉన్న స్మార్ట్ బస్ పాస్ ద్వారా పల్లె వెలుగు నుండి ఎక్స్ ప్రెస్ బస్సుల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. గ్రామ సచివాలయాలు లేదా ఆర్టీసీ డిపోల్లో దరఖాస్తు చేసుకుని ఈ సదుపాయాన్ని పొందవచ్చు.