వాట్సాప్ సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక

రిపోర్టర్: శివ స్థలం: అల్లూరి సీతారామరాజు

వాట్సాప్ వేదికగా జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు హెచ్చరించారు. లాటరీ, పార్ట్టైమ్ జాబ్, వాట్సాప్ గోల్డ్, కేవైసీ అప్డేట్ పేరుతో వచ్చే అనుమానాస్పద మెసేజ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించారు. తెలియని లింకులపై క్లిక్ చేయడం, ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంక్ వివరాలను ఇతరులతో పంచుకోవడం వంటివి చేయరాదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అల్లూరి పోలీస్ అధికారిక ఖాతా ద్వారా వెల్లడించారు.