ఆసియా గేమ్స్: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ నియామకం

రిపోర్టర్: నరేష్ స్థలం: World

2026 ఆసియా గేమ్స్‌కు భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నారు. వెస్టిండీస్ సిరీస్ నేపథ్యంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. మహిళల జట్టుకు అమోల్ ముజుందార్ కోచ్‌గా కొనసాగుతారు. మరోవైపు, జపాన్‌లో క్రీడాకారుల వసతి ఏర్పాట్లపై నెలకొన్న వివాదంపై జపాన్ క్రికెట్ అసోసియేషన్ స్పందిస్తూ, హోటల్ వసతి కల్పిస్తున్నామని, జట్లు సొంతంగా ఏర్పాట్లు చేసుకోవచ్చని తెలిపింది.