ఎనిమిదోసారి ఆసియా కప్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు

రిపోర్టర్: హరి స్థలం: దుబాయ్

దుబాయ్ వేదికగా జరిగిన మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి భారత జట్టు ఎనిమిదోసారి ఛాంపియన్‌గా నిలిచింది. షఫాలీ వర్మ, స్మృతి మంధన రాణించగా, బౌలర్లు సమిష్టిగా విజృంభించి లంకను 111 పరుగులకే కట్టడి చేశారు.