సినిమా ప్రియులకు షాక్: రామాయణం పార్ట్ 2 విడుదల వాయిదా

రిపోర్టర్: మహేష్ స్థలం: Mumbai

నితీష్ తివారీ తెరకెక్కించిన భారీ పౌరాణిక చిత్రం రామాయణం రెండో భాగం విడుదల 2028కి వాయిదా పడినట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రణాళికాబద్ధంగా అత్యుత్తమ గ్రాండియర్ అందించేందుకే ఈ ఏడాది అదనంగా సమయం తీసుకుంటున్నట్లు వివరించారు.