మౌలిక వసతులు కరువై విలవిల్లాడుతున్న ఆసుపత్రి రోగులు

రిపోర్టర్: మదన్ రాయల్ స్థలం: తిరుపతి అర్బన్

తిరుపతి జిల్లా తిరుపతిలోని రొయ్య ఆసుపత్రిలో రోగులకు కనీస సౌకర్యాలు అందడం లేదని రోగులు, వారి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో తాగునీటి వసతి లేకపోవడంతో పాటు వాష్రూమ్లలో నీటి సౌకర్యం కరువైంది. పురుషులు, మహిళలకు వేర్వేరుగా బాత్రూమ్ సౌకర్యాలు లేక ఒకే దానిని ఉపయోగించాల్సి వస్తోందని, శస్త్రచికిత్సలు జరిగిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.