సమాజ సేవ కోసం సొంత ఫౌండేషన్‌ను ప్రారంభించిన షోహై ఒంటాని

రిపోర్టర్: భాస్కర్ స్థలం: World

ప్రముఖ బేస్‌బాల్ స్టార్ షోహై ఒంటాని, తన భార్య మామికో తనాకాతో కలిసి 'షోహై ఒంటాని ఫ్యామిలీ ఫౌండేషన్'ను ప్రారంభించారు. పిల్లల ఆరోగ్యం, క్రీడా కార్యకలాపాలు మరియు జంతు సంరక్షణకు మద్దతు ఇవ్వడమే ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. మైదానంలోనే కాకుండా సమాజంలోనూ తన సేవా గుణాన్ని చాటుకుంటూ ఈ సరికొత్త సామాజిక బాధ్యతకు శ్రీకారం చుట్టారు.