షార్ట్ సర్క్యూట్తో మూడు గిరిజన గుడిసెలు దగ్ధం బాధితులకు జనసేన భరోసా

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం జంగాలపల్లి గిరిజన కాలనీలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఎంసీ డైరెక్టర్ వాణి భవాని నాయుడు ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని, త్వరలోనే ఇల్లు నిర్మించి ఇస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.