న్యాయాధికారుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు

రిపోర్టర్: గోపి స్థలం: India

దేశవ్యాప్తంగా న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు అనుభవజ్ఞులైన న్యాయమూర్తుల సేవలు అవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికే ఏడు రాష్ట్రాలు దీనికి అంగీకరించగా, ఏపీ, తెలంగాణ సహా మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.