భూసేకరణ సర్వే అధికారులను అడ్డుకున్న రైతులు: హుస్నాబాద్‌లో ఉద్రిక్తత
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సబ్‌స్టేషన్ సమీపంలో గౌరవెల్లి ఉప కాలువ భూ సేకరణ సర్వే చేయడానికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకొని తీవ్ర ఆందోళన చేపట్టారు. రోడ్డు విస్తరణకు ఎకరం భూమి కోల్పోయామని, ఇప్పుడు కాలువ కోసం మరో ఎకరం భూమి లాక్కుంటే తమ బతుకులు రోడ్డున పడతాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.