కనిగిరి జలాశయం క్రస్ట్‌గేట్ల నుంచి వృథాగా పోతున్న నీరు

రిపోర్టర్: విజయ్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా సంగం మండలంలోని కనిగిరి జలాశయం రేడియల్ క్రస్ట్‌గేట్ల అడుగుభాగం నుంచి నీరు లీకై వృథాగా పోతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఒకటిన్నర లక్షల ఎకరాల ఆయకట్టు కలిగిన ఈ జలాశయ గేట్ల మరమ్మతుల కోసం ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. జలాశయాలు, రెగ్యులేటర్ల ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.