రామాయణ పాటలపై విమర్శలు: అందరినీ సంతృప్తిపరచలేమన్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

రామాయణ చిత్రంలోని పాటలపై వస్తోన్న విమర్శల పట్ల ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందించారు. ప్రతి ఒక్కరి అభిప్రాయానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, అందరినీ సంతృప్తిపరచాలనుకుంటే ఐస్క్రీమ్ అమ్ముకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన ఒక పాట సంగీతంపై నెటిజన్లు చేసిన విమర్శలను కొట్టిపారేస్తూ, స్వరాలు పాతబడే కొద్దీ మరింత రుచిగా మారుతాయని, ప్రేక్షకులు కొంచెం ఓపిక పట్టాలని ఆయన వివరించారు.