ఇరాన్ అణు కార్యక్రమంపై సమాచారానికి ఇరవై మిలియన్ డాలర్ల భారీ రివార్డ్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Washington

ఇరాన్ అణు కార్యక్రమం, కేంద్రాలు, మరియు శాస్త్రవేత్తల సమాచారం అందించే వారికి ఇరవై మిలియన్ డాలర్ల వరకు రివార్డుతో పాటు పునరావాసం కల్పిస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ నిబంధనలను ఇరాన్ ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఇరాన్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.