వైద్య వృత్తి నుండి కేంద్ర మంత్రిత్వ శాఖకు ఐఏఎస్ డాక్టర్ త్యాగరాజన్ ప్రయాణం
రిపోర్టర్: రాజేష్
స్థలం: New Delhi
ఎంబీబీఎస్ పూర్తి చేసి తొలుత ఐపీఎస్‌గా, ఆ తర్వాత ఐఏఎస్‌గా ఎంపికైన డాక్టర్ త్యాగరాజన్ ఎస్ఎం కేంద్ర సహకార మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ స్థాయి బాధ్యతలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఈ 2011 బ్యాచ్ బీహార్ క్యాడర్ అధికారి ఐదు సంవత్సరాల పాటు కేంద్ర సర్వీసులో కొనసాగుతారని, ఆయన గతంలో గయా, నలంద జిల్లాల కలెక్టర్‌గా సేవలందించారని తెలిపారు.