అధికారులను వెంటనే బదిలీ చేయాలంటూ అంగన్వాడీల ఆందోళన

రిపోర్టర్: KISHORE M స్థలం: ఆదోని

ఆదోని ప్రాజెక్టు సీడీపీఓ డిల్లేశ్వరి, సీనియర్ క్లర్క్ రాజశేఖర్ చౌదరిని బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు మంగళవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో అరుణాదేవికి వినతిపత్రం అందజేశారు. అధికారుల తీరుతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని, రాజకీయ పలుకుబడితో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని నాయకులు ఆరోపించారు.