ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు కిచెన్ గార్డెన్.. దూది వెంకటాపూర్ బడిలో సాగు!
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలం దూది వెంకటాపూర్ జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించేందుకు కిచెన్ గార్డెన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో వంకాయ, టమాట, ఆకుకూరలు తదితర కూరగాయలను సాగు చేస్తూ విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాన్ని కల్పిస్తున్నారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు సుంచు విజయలక్ష్మి ఆధ్వర్యంలో, బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్ రాగుల రవీందర్ పర్యవేక్షణలో సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.