కేసీఆర్, జగన్ కుమ్మక్కు వల్లే తెలంగాణకు నీటి నష్టం: కోమటిరెడ్డి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో కృష్ణా జలాల వాటాపై రాజకీయ వివాదం తీవ్రమైంది. మాజీ సీఎం కేసీఆర్, అప్పటి ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి కుమ్మక్కు కావడం వల్లే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. వారిద్దరి సాన్నిహిత్యం కారణంగానే తెలంగాణ తనకు దక్కాల్సిన నీటి వాటాను కోల్పోయిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం హక్కులను కాపాడటంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.