జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్న సివిల్ ఇంజినీర్ గీతాంజలి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ప్రకాశం
ఒంగోలుకు చెందిన కొప్పోలు గీతాంజలి సివిల్ ఇంజినీరింగ్ రంగంలో సవాళ్లను అధిగమించి విజయవంతంగా రాణిస్తున్నారు. మట్టి పరీక్షలు, జియోటెక్నికల్ ఇంజినీరింగ్‌పై మక్కువతో వరంగల్ ఎన్ఐటీలో మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా సేవలందిస్తున్న ఆమె, ప్రతిష్టాత్మక 'అవుట్ స్టాండింగ్ ఉమన్ ఇంజినీర్' జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకుని మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు.