రాజాపేట మండలం బేగంపేటలో ఘనంగా పాడి రైతులకు బోనస్ పంపిణీ

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేట పాల కేంద్రంలో దసరా పండుగ సందర్భంగా ఆదివారం పాడి రైతులకు బోనస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డెయిరీ మేనేజర్ శేఖర్, సూపర్వైజర్ రాములు, చైర్మన్ ఎడ్ల భూపాల్ రెడ్డి, పశువైద్యుడు డాక్టర్ ఉదయ్, మాజీ చైర్మన్లు తోట సత్తయ్య, రామస్వామి, అలాగే పలువురు పాడి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.