ఆత్మహత్యల నివారణకు అందరం సమిష్టిగా కృషి చేయాలని డాక్టర్ శివప్రసాద్ పిలుపు
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డా. చినుకని శివప్రసాద్ మానసిక ఆరోగ్యంపై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏడు లక్షలకు పైగా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒత్తిడితో బాధపడుతున్న వారిని సకాలంలో గుర్తించి సహాయం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చని సూచించారు.