భారీ వర్షాల బీభత్సం: సత్తుపల్లిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఖమ్మం
తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. జేవీఆర్, కిష్టారం ఓపెన్‌కాస్ట్ గనుల్ లో పనులు పూర్తిగా నిలిచిపోయాయని వెల్లడించారు. రెండు గనుల్ లో కలిపి సుమారు నలభై ఎనిమిది వేల టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు లక్షా తొంభై వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు ఆటంకం కలిగిందని సింగరేణి అధికారులు స్పష్టం చేశారు.