మంగళూరులో డ్రగ్స్ వ్యసనానికి గురైన విద్యార్థులకు పోలీసుల కౌన్సిలింగ్

రిపోర్టర్: మహేష్ స్థలం: కర్ణాటక

మంగళూరులో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తేలిన విద్యార్థులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో మంచి ఫలితాలు వచ్చాయి. పరీక్షించిన 8,310 మంది విద్యార్థుల్లో 98 మంది డ్రగ్స్‌కు అలవాటు పడినట్లు గుర్తించారు. వారిలో కొందరికి నిర్వహించిన పునఃపరీక్షల్లో 38 మంది డ్రగ్స్‌ను పూర్తిగా మానేసినట్లు తేలింది. విద్యార్థులను బాధితులుగా భావించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తే మార్పు వస్తుందని పోలీస్ కమిషనర్ సుధీర్ కుమార్ రెడ్డి నిరూపించారు.