మూత్రపిండాల ఆరోగ్యానికి తగిన జాగ్రత్తలు: వైద్య నిపుణుల కీలక సూచనలు

రిపోర్టర్: విజయ్ స్థలం: Hyderabad

మధుమేహం మరియు రక్తపోటు బాధితులు మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నెఫ్రోప్లస్ సీనియర్ చీఫ్ డైటీషియన్ డాక్టర్ అపేక్ష ఏక్బోటే స్పష్టం చేశారు. రోజువారీ ఆహారంలో తీసుకునే ఉప్పు మోతాదు, ప్రొటీన్ల వినియోగం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె తెలిపారు. లక్షణాలు బయటపడేలోపు కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందని, నిత్య జీవితంలో సరైన ఆహారపు అలవాట్లను పాటించడం ద్వారా ప్రాణాంతక ముప్పును ముందస్తుగా నివారించవచ్చని వెల్లడించారు.