గంగాధర మోడల్ స్కూల్ విద్యార్థినుల ప్రజ్ఞ: చిత్రలేఖనం, వాలీబాల్ లో కవలల ప్రతిభ

రిపోర్టర్: మహేష్ స్థలం: గంగాధర

గంగాధర మోడల్ స్కూల్ విద్యార్థిని రావుల స్రాగ్వి జిల్లాస్థాయి చిత్రలేఖన పోటీల్ లో ప్రథమ బహుమతి సాధించినట్లు ప్రిన్సిపాల్ పద్మ తెలిపారు. వాలీబాల్ పోటీల్లోనూ ఆమెతో పాటు కవల సోదరి స్నిగ్ధ సభ్యురాలిగా ఉన్న జట్టు విజేతగా నిలిచిందని పేర్కొన్నారు. చదువుతో పాటు కళలు, క్రీడల్లోనూ రాణిస్తున్న విద్యార్థినులను పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఘనంగా అభినందించారు.