రైల్వే ప్రయాణికులకు తీపి కబురు: కౌంటర్ టికెట్లకూ వర్తించనున్న బీమా సదుపాయం
రిపోర్టర్: రాము
స్థలం: తెలంగాణ
భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రత కోసం మరో సంచలన నిర్ణయం తీసుకుందని రైల్వే బోర్డు అధికారులు వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటివరకు ఆన్లైన్ బుకింగ్లకు మాత్రమే పరిమితమైన ప్రయాణ బీమా సదుపాయాన్ని, ఇకపై స్టేషన్ కౌంటర్లలో రిజర్వేషన్ టికెట్లు కొనుగోలు చేసే సాధారణ ప్రయాణికులకు కూడా వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ విధానంలో పేమెంట్ చేసే ప్రయాణికులు కేవలం నలభై ఐదు పైసల ప్రీమియంతో పది లక్షల రూపాయల వరకు ఆర్థిక రక్షణ పొందవచ్చని స్పష్టం చేశారు.