మహారాజ 2 సినిమాపై క్లారిటీ ఇచ్చిన హీరో విజయ్ సేతుపతి
రిపోర్టర్: నరేష్
స్థలం: చెన్నై
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ మహారాజకు సీక్వెల్ రానున్నట్లు స్పష్టత వచ్చింది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తనకు మహారాజ 2 కథను వినిపించారని, ఒరిజినల్ మూవీ మాదిరిగానే సీక్వెల్ కథ కూడా చాలా బలంగా వచ్చిందని తెలిపారు. అలాగే ఈ సినిమా హాలీవుడ్ రీమేక్ రైట్స్‌ను ప్రముఖ ఏజెన్సీ దక్కించుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, ఒకవేళ హాలీవుడ్‌లో అవకాశం వస్తే ఉచితంగా నటిస్తానని సరదాగా చమత్కరించారు.