కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రమేష్ స్థలం: న్యూఢిల్లీ

దేశంలో కార్పొరేట్ ఆస్పత్రులు సామాన్య ప్రజలను దారుణంగా దోచుకుంటున్నాయని సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆక్రోశం వ్యక్తం చేసినట్లు న్యాయ నిపుణులు తెలిపారు. కేన్సర్ మందులను పదింతల ధరకు అమ్ముతూ మారణహోమానికి పాల్పడుతున్నాయని అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. మృతదేహాలను కూడా బయటకు తీసుకెళ్లనివ్వకుండా ఇవి పరిశ్రమలుగా మర్డర్ బిజినెస్ చేస్తున్నాయని సుప్రీంకోర్టు ఆవేదన వెళ్లగక్కింది. ఈ దోపిడీని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు కఠిన నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.