ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలు: 100 స్థానాలకు గాను 93 స్థానాలు కైవసం చేసుకున్న ఎన్డీయే

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Hyderabad

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్ లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్ లో మొత్తం వంద స్థానాలకు గాను ఎన్డీయే ఏకంగా తొంబై మూడు స్థానాలను కైవసం చేసుకుందని ఆయన పేర్కొన్నారు. ఈవీఎంల మద్దతు లేనప్పుడే ప్రజల నిజమైన తీర్పు బయటపడుతుందని, ఇది ప్రజల విశ్వాసానికి నిదర్శనమని సోషల్ మీడియా వేదికగా జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.