రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
రిపోర్టర్: గోపి
స్థలం: భారతదేశం
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ప్రవేశ పరీక్ష 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని పరీక్ష నిర్వహణ సంస్థ వెల్లడించింది. జూలై 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి 8వ తరగతి ప్రవేశాల కోసం డిసెంబర్ 6న దేశవ్యాప్తంగా 39 నగరాల్లో ఈ పరీక్ష జరగనుంది. అక్టోబర్ 1 నుండి 7 వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరించనున్నారు.