యూఏఈలో 2027 హజ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ప్రారంభం

రిపోర్టర్: నరేష్ స్థలం: World

యూఏఈలో 2027 హజ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 15 సంవత్సరాలు నిండి, ఇంతకుముందు హజ్ చేయని యూఏఈ పౌరులు మాత్రమే దీనికి అర్హులు. అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా డిజిటల్‌గా దరఖాస్తు చేసుకోవాలని ఇస్లామిక్ వ్యవహారాల అధికారి తెలిపారు.