వర్ధన్నపేటలో హెల్మెట్ పుణ్యమా అని ప్రాణాపాయం నుంచి త్రుటిలో బయటపడ్డ వాహనదారుడు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వర్ధన్నపేట

వర్ధన్నపేట అంబేడ్కర్ సెంటర్ వద్ద ద్విచక్రవాహనదారుడు ప్రమాదానికి గురయ్యాడు. హెల్మెట్ ధరించి ఉండటంతో తలకు తీవ్ర గాయాలు కాకుండా ఆయన ప్రాణాపాయం నుంచి త్రుటిలో బయటపడ్డాడు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హెల్మెట్ ప్రాణరక్షణకు ఎంత అవసరమో ఈ సంఘటన నిరూపించిందని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్థానికులు సూచిస్తున్నారు.