రేణిగుంట-అరక్కోణం రైల్వే లైన్ల అభివృద్ధికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం

రిపోర్టర్: విజయ్ స్థలం: తిరుపతి

రేణిగుంట-అరక్కోణం మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ముంబై-చెన్నై హైడెన్సిటీ కారిడార్ అభివృద్ధిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అదనపు మార్గాల ద్వారా తిరుమల వచ్చే భక్తులతో పాటు హైదరాబాద్, విశాఖ, ముంబై తదితర ప్రాంతాల ప్రయాణికులకు రవాణా మరింత సులువుకానుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా లాజిస్టిక్ హబ్‌గా మారనుంది.