పిల్లల్ లో పెరుగుతున్న శ్వాసకోశ సమస్యలు: తల్లిదండ్రులకు కీలక హెచ్చరికలు జారీ చేసిన వైద్యులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: నోయిడా

నవంబర్ నెలలో మారుతున్న వాతావరణం మరియు తీవ్ర వాయు కాలుష్యం కారణంగా పిల్లల్ లో ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయని నోయిడా మదర్ హుడ్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అమిత్ గుప్తా వెల్లడించారు. చలికాలం ప్రారంభంలో గాలి నాణ్యత పడిపోవడం వల్ల చిన్నారుల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడుతుందని, రాత్రి సమయాల్ లో దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.