కూటమి డీఎస్సీ అక్రమాలపై యువత ధర్నాతో కూసాలు కదిలాయి
రిపోర్టర్: గోపి
స్థలం: విజయవాడ
కూటమి ప్రభుత్వ డీఎస్సీ అక్రమాలపై జెన్ జీ యువత చేపట్టిన ధర్నాతో ప్రభుత్వ కూసాలు కదిలిపోయాయని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద మంత్రి నారా లోకేష్ రౌడీ దళం వికృత చేష్టలకు పాల్పడిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు.