వైకాపాకు భారీ షాక్.. తెదేపాలో చేరిన మజ్జి శ్రీనివాసరావు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయనగరం

విజయనగరం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. వైకాపా జిల్లా అధ్యక్షుడు, జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. బొత్స సత్యనారాయణతో విభేదాల కారణంగానే ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.