డిసెంబర్ లోపు ఆసుపత్రి ప్రారంభించాలంటూ కాక్రోజ్ జనతా పార్టీ డిమాండ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వరంగల్

ఈ ఏడాది డిసెంబర్ 31లోగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించాలని CJP వరంగల్ ప్రతినిధి శ్రీనిత డిమాండ్ చేశారు. ఎంజీఎంలో జరిగిన అవకతవకలపై ఆడిట్ నిర్వహించాలన్నారు. ఎంజీఎం ఆస్పత్రి ఆరోగ్యశ్రీ వార్డులో భవనం పెచ్చులూడిన ఘటనలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వచ్చిన తమను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించకపోతే జంతర్ మంతర్ తరహాలో WGLలో ఆందోళన చేపడతామని అన్నారు.