వైకల్య సర్టిఫికెట్లకై విలవిల్లాడుతున్న అభాగ్యుల ఆక్రోశ గర్జన

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

చిట్వేల్లో సదరం స్లాట్లు, సర్టిఫికెట్లు వెంటనే మంజూరు చేసి వికలాంగులను ఆదుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సీపీఐ మండల నాయకులు సామ గంగయ్య అధ్యక్షతన నిర్వహించిన ప్రెస్మీట్లో రైల్వేకోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, మండల నాయకుడు తిప్పన ప్రసాద్ మాట్లాడారు. సర్టిఫికెట్లు ఆలస్యం కావడంతో పలువురు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని తెలిపారు. పెన్షన్ దరఖాస్తుల గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని కోరారు.